నందమూరి అభిమానులకు కన్నుల పండుగ.. ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ అబ్బాయ్

  • ప్రారంభమైన 'అరవింద సమేత' సక్సెస్ మీట్
  • అబ్బాయిలతో కలసి వచ్చిన బాలయ్య
  • కేరింతలు కొట్టిన అభిమానులు
హైదరాబాదులోని శిల్పకళావేదికలో 'అరవింద సమేత' సక్సెస్ మీట్ సందడిగా కొనసాగుతోంది. ఈ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాబాయ్ తో కలసి అబ్బాయిలు తారక్, కల్యాణ్ రామ్ లు ఆడిటోరియంలోకి ప్రవేశించగానే నందమూరి అభిమానులు కేరింతలు కొట్టారు. విజిల్స్ కొడుతూ, నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మధ్యలో కూర్చోగా ఆయనకు అటూఇటుగా తారక్, కల్యాణ్ రామ్ లు కూర్చున్నారు. ఇద్దరితో బాలయ్య ఆప్యాయంగా మాట్లాడుతుండటం అందరినీ ఆకట్టుకుంది.
Go Back to Shorts
aravinda sametha
success meet
Balakrishna
junior ntr
kalyana ram

More Telugu News